భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు
రిపోర్టర్: దొంతంశెట్టి సతీష్
స్థలం: కాకినాడ అర్బన్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్లను ఆర్డీవో కార్యాలయంలో 8008803208, కలెక్టరేట్లో 9849903879 నంబర్లతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వర్షపాతం, రిజర్వాయర్లు, చెరువులు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలను కంట్రోల్ రూమ్ల ద్వారా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.