సీఎం రాచపల్లిలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి బాలాజీ ముమ్మర ప్రచారం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: చిట్వేల్
చిట్వేల్ మండలంలోని సీఎం రాచపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా శ్రీకుల బాలాజీ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ అభ్యర్థి ఎంపిక వెనుక పార్టీ సీనియర్ నాయకుడు కొండూరు త్రివిక్రమ్ రాజు కీలక పాత్ర పోషించారు. ఆయన వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో అభ్యర్థి ప్రజల మద్దతు కూడగట్టేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ గ్రామస్థుల నుంచి విశేష స్పందనను సొంతం చేసుకుంటున్నారు.