దేశ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి లక్ష్యం: రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్
రిపోర్టర్: శివ
స్థలం: జైసల్మేర్
మారుతున్న యుద్ధ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సైనిక సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాలని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వదేశీ పరిజ్ఞానంతో 2029 నాటికి రక్షణ ఉత్పత్తుల విలువను మూడు లక్షల కోట్లకు, ఎగుమతులను యాభై వేల కోట్లకు చేర్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు.