జన్నారం అడవుల్లో టైగర్ కన్జర్వేషన్ బృందం క్షేత్రస్థాయి వేట
రిపోర్టర్: gourinatha p.g
స్థలం: జన్నారం
మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ ప్రాంతంలో నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ బృందం సభ్యులు పర్యటిస్తున్నారు. ఆరుగురు ఎన్‌టిసిఎ బృందం సభ్యులు అటవీ ప్రాంతంలో ఉన్న గనిశెట్టి కుంట, గడ్డి క్షేత్రాలను పరిశీలించారు. అడవులు, వన్యప్రాణులు, అటవీ భూముల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను అధికారులతో సమీక్షిస్తున్నారు. అటవీ జోన్ ఎత్తివేయాలని ఆందోళనల వేళ వారి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.