శ్రీపురం శ్రీలక్ష్మీ నారాయణి ఆలయంలో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు
రిపోర్టర్: సునీల్
స్థలం: వెలూరు
వేలూరులోని ప్రసిద్ధ శ్రీపురం శ్రీలక్ష్మీ నారాయణి గోల్డెన్ టెంపుల్ ప్రాంగణంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వర్ధిల్లాలని శ్రీవారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.