అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించిన సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్
రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి
స్థలం: ఆత్మకూరు(ఎం)
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండల కేంద్రం మరియు గ్రామ పంచాయతీలో గత కొంత కాలం నుండి అస్తవ్యవస్థమైన డ్రైనేజీలు. మురుగునీరు బయటికి వెళ్లకుండా నిండి ఇంటి ముందు సీసీ రోడ్లపై ప్రవహిస్తుండడంతో కాలనీవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారని సమాచారం ఇవ్వగానే స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించిన సర్పంచ్ బిసు ధనలక్ష్మి చందర్ గౌడ్.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఆంబోజు శేఖర్,ఉపసర్పంచ్ మజ్జిగ నరేష్,పైల్ల ప్రశాంత్,బబ్బురి శివలింగం,బత్తిని నాగయ్య, కాలనీవాసులు,తదితరులు ఉన్నారు.