వనపర్తిలో భార్య దారుణ పథకం: ప్రియుడితో కలిసి భర్త హత్యాయత్నం

రిపోర్టర్: విజయ్ స్థలం: వనపర్తి

వనపర్తి పట్టణంలో నవవధువు షాహిదా బేగం ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు యత్నించినట్లు ఎస్ఐ హరిప్రసాద్ తెలిపారు. పెళ్లై నెల రోజులు కాకముందే ప్రియుడు షాకీర్, అతడి స్నేహితుడితో కలిసి నిద్రిస్తున్న భర్త షబ్బీర్ ముఖంపై హిట్ స్ప్రే కొట్టి బెల్టుతో గొంతు నులిమి హత్యకు కుట్ర పన్నింది. బాధితుడు కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై కాపాడారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.