నా కల నెరవేరలేదు: ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్‌పై విద్యాబాలన్ భావోద్వేగం
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
దిగ్గజ గాయని ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటించాలనే తన కల నెరవేరకపోవడం ఎంతో బాధగా ఉందని ప్రముఖ నటి విద్యాబాలన్ పేర్కొన్నారు. రాజీవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ చిత్రం పదేళ్ల క్రితం న్యాయపరమైన వివాదాల కారణంగా నిలిచిపోయినట్లు తెలిపారు. చిన్నతనం నుంచే సుబ్బులక్ష్మి గొంతుతో తన రోజు ప్రారంభమయ్యేదని గుర్తుచేసుకున్నారు. అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధమైనప్పటికీ సినిమా ఆగిపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.