ఎనిమిదేళ్ల తర్వాత సీఎఫ్‌ఎల్ ప్రీమియర్ డివిజన్ టైటిల్ గెలుచుకున్న మోహన్ బగాన్

రిపోర్టర్: నరేష్ స్థలం: కోల్‌కతా

కోల్‌కతాలోని బరాసత్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన సీఎఫ్‌ఎల్ ప్రీమియర్ డివిజన్ ఫైనల్ మ్యాచ్‌లో మహమ్మదెన్ ఎస్‌సీపై 3-2 గోల్స్ తేడాతో విజయం సాధించిన మోహన్ బగన్ ఎస్జీ ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టైటిల్‌ను కైవసం చేసుకుంది. సాహల్ అబ్దుల్ సమద్ రెండు గోల్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించగా, సయాన్ బెనర్జీ మరో గోల్ సాధించి బస్తబ్ రాయ్ శిక్షణలోని మోహన్ బగాన్ జట్టుకు ఛాంపియన్‌షిప్‌ను అందించారు.