షార్జాలో ఉడుపి వ్యక్తి దారుణ హత్య భీభత్సం
రిపోర్టర్: హరి
స్థలం: ఉడుపి
కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లా కుందాపూర్ ప్రాంతానికి చెందిన అల్విన్ అనే వ్యక్తి షార్జాలో దారుణ హత్యకు గురయ్యారు. జూలైలో అదృశ్యమైన ఆయన మృతదేహం ఆగస్టు 12న ఓమన్ మార్గంలోని కారు డిక్కీలో తొమ్మిది ముక్కలుగా లభ్యమైంది. అల్విన్ భార్య టీనా కుందర్, కుమారుడు కనిపించకుండా పోవడం, వారి ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు.