ఫ్లైదుబాయ్ విమాన పైలట్ స్మిత్ సాహసానికి కేంద్రమంత్రి ప్రశంసలు

రిపోర్టర్: శివ స్థలం: ఢిల్లీ

కాక్పిట్లో అసాధారణ ధైర్యం ప్రదర్శించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన ఫ్లైదుబాయ్ విమాన కెప్టెన్ స్మిత్ మచ్చర్ సాహసం ప్రశంసనీయమని పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఎఫ్జెడ్1073 విమానాన్ని కూల్చివేయడానికి కో-పైలట్ చేసిన ప్రయత్నాన్ని అడ్డుకునే క్రమంలో ఆయనపై దాడి జరిగినా వెనకడుగు వేయలేదన్నారు. మచ్చర్ ప్రతి భారతీయుడికి గర్వకారణమని, ఆయన చూపిన సమయస్ఫూర్తి లెక్కలేనన్ని ప్రాణాలను రక్షించిందని మంత్రి గురువారం తెలిపారు.