యువతలో సృజనాత్మకత పెంపునకు సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్

రిపోర్టర్: నరేష్ స్థలం: బెంగళూరు

సమాజంలోని సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు కనుగొనేందుకు సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ వెబ్సైట్ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. ఐఐఎస్సీ బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సేవను నూతన ఆవిష్కరణలతో అనుసంధానించడం ద్వారానే వాస్తవ ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలవుతుందని స్పష్టం చేశారు. పాఠశాలలు, ఐటీఐలు, పాలిటెక్నిక్, కళాశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.