తెలంగాణ రక్షణ సేన అధికార ప్రతినిధిగా సిద్ధంశెట్టి సాజన్ నియామకం

రిపోర్టర్: ramesh chitty స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన సిద్ధంశెట్టి సాజన్ తెలంగాణ రక్షణ సేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాజన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు తనవంతు పూర్తి కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.