మహిలకు ఇచ్చిన రూ. 1500 హామీ అమలు చేయాలంటూ పద్మావతి డిమాండ్

రిపోర్టర్: GANESH BBL స్థలం: బొబ్బిలి

విజయనగరం జిల్లా బొబ్బిలిలో కూటమి ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎం. పద్మావతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు నెలకు రూ. 1500 చొప్పున ఇప్పటివరకు జమ చేయలేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా పథకం అమలు చేయకపోవడం మోసపూరితమన్నారు. తక్షణమే బకాయితో సహా డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.