పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రతి ఒక్కరి ముఖ్య బాధ్యత
రిపోర్టర్: ఆముదాల వెంకన్న
స్థలం: ఖమ్మం అర్బన్
అక్టోబర్ ఇరవై నాలుగు ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో డీఎంహెచ్ఓ డాక్టర్ డి రామారావు పోలియో నివారణపై అవగాహన కల్పించారు. కలుషిత ఆహారం నీటి ద్వారా పోలియో వ్యాపిస్తుందని తెలిపారు. పిల్లలకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయాలని సూచించారు. రెండు వేల పదకొండు నుంచి దేశంలో పోలియో కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు.