స్థానిక ఎన్నికలు జరగకుండా అడ్డుకోవాలన్నదే వైకాపా కుట్ర: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
రిపోర్టర్: రమేష్
స్థలం: శ్రీకాకుళం
స్థానిక ఎన్నికలు జరగకుండా అడ్డుకోవాలన్నదే వైకాపా కుట్ర అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆక్షేపించారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి ఆయన మాట్లాడారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే రిజర్వేషన్లు పెంచినట్లు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల క్రిమినల్ ఆలోచనల వల్లనే బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.