బొబ్బిలిలో పారాది వంతెన ట్రయల్ రన్ విజయవంతం

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: బొబ్బిలి

బొబ్బిలి మండలం పారాది వద్ద రూ.17.83 కోట్ల వ్యయంతో నిర్మించిన వంతెన ట్రయల్ రన్ సోమవారం విజయవంతంగా పూర్తయింది. ఈ కార్యక్రమానికి బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు, కూటమి నేతలు హాజరై పనులను పరిశీలించారు.

ఎమ్మెల్యే బేబీనాయన కృషి ఫలితంగా ఈ వంతెన నిర్మాణం పూర్తయిందని, త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి వస్తుందని నేతలు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సహకరించిన ప్రభుత్వం, మంత్రులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.