గత ప్రభుత్వం రహదారులను విస్మరించింది: గిరడ అప్పలస్వామి

రిపోర్టర్: Bobbili GANESH స్థలం: బొబ్బిలి

గత ప్రభుత్వ హయాంలో రహదారుల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి విమర్శించారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా దోచుకోవడమే ధ్యేయంగా పనిచేశారని ఆయన మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగా ఒక్కొక్కటిగా హామీలను నెరవేరుస్తోందని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే అర్హులైన వారికి కొత్త పింఛన్లను కూడా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.