ముంబై ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య కలకలం
రిపోర్టర్: అశోక్
స్థలం: ముంబై
ముంబై ఐఐటీలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి శుక్రవారం సాయంత్రం తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్ష హాల్‌లో మొబైల్ ఫోన్ ఉపయోగించి ప్రశ్నపత్రాన్ని ఏఐ ప్లాట్‌ఫారమ్‌లో అప్‌లోడ్ చేశాడనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది. విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ కోరుతూ తోటి విద్యార్థులు క్యాంపస్‌లో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని యాజమాన్యం స్పష్టం చేసింది.