ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈదురుగాలులతో విరుచుకుపడనున్న భారీ వర్షాలు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం

ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నవంబర్ నాలుగు మధ్యాహ్నం ఒంటిగంట వరకు హెచ్చరిక అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. రానున్న రెండు మూడు గంటల్లో తేలికపాటి వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.