గురువులపై వైకాపా మహిళా నేత అనుచిత వ్యాఖ్యలపై దుమారం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: శ్రీకాకుళం

ఉపాధ్యాయులను కించపరుస్తూ వైకాపా పార్టీకి చెందిన మహిళా నేత చేసిన తీవ్ర అసభ్యకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రప్పా రప్పా నరుకుతామంటూ గురువులను బెదిరిస్తూ ఆమె మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. సమాజానికి విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులపై ఇలాంటి దిగజారుడు భాష ఉపయోగించడంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వైకాపా నాయకుల తీరుపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి.