ఓట్ల వేటలో విపక్షాలపై నిప్పులు చెరిగిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

రిపోర్టర్: సాయి దివ్య స్థలం: వెంకటాచలం

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఈదగాలి, సర్వేపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలోనే గ్రామాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.