తుపాను నష్టాలపై సర్కార్ అంచనా తప్పు: వైఎస్ షర్మిల తీవ్ర నిప్పులు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Amaravati
రాష్ట్రంలో తుపాను ప్రభావంతో జరిగిన భారీ నష్టాన్ని ప్రభుత్వం తక్కువ చేసి చూపుతోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అమరావతిలో శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ, పంటలు, మౌలిక వసతులు కలిపి దాదాపు పదిహేను వేల కోట్ల నష్టం వాటిల్లితే కేవలం నాలుగు వేల ఆరు వందల కోట్లు మాత్రమే అంచనా వేశారని మండిపడ్డారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.