ఓటు హక్కుపై దాడి ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పంటూ రాహుల్ గాంధీ పోరాటం

రిపోర్టర్: గోపి స్థలం: ఖమ్మం

ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది లాంటిదని, దానిని దెబ్బతీస్తే రాజ్యాంగ విలువలకు తీవ్ర విఘాతమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖమ్మంలో స్పష్టం చేశారు. కేవలం ఒక్క పార్టీ కోసం కాకుండా దేశ ప్రజల హక్కుల పరిరక్షణ కోసమే రాహుల్ గాంధీ నిరంతరం పోరాడుతున్నారని ఆయన వెల్లడించారు. ప్రతి పౌరుడి ఓటు హక్కును రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, కేంద్ర ప్రభుత్వ తీరుతో ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు వాటిల్లుతోందని ఆయన తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు.