రేణికుంటలో సేవా సంకల్ప అభియాన్: మొక్కలు నాటిన బీజేపీ శ్రేణులు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలంలోని రేణికుంట గ్రామంలో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ రెడ్డి హాజరై పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మేకల రమేష్ తో పాటు స్థానిక రైతులు, పార్టీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.