కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న బైరి శంకర్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: అక్కన్నపేట

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గ్రామానికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని బిజెపి పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్ సూచించారు. సోమవారం నాడు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.