ఇంటి వద్దే ఆన్లైన్లో లెర్నర్స్ లైసెన్స్ పరీక్ష విధానానికి శ్రీకారం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమరావతి

డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రజల సౌలభ్యం కోసం ఇంటి వద్దే ఆన్లైన్లో లెర్నర్స్ లైసెన్స్ పరీక్ష రాసే నూతన సదుపాయాన్ని రవాణాశాఖ అమల్లోకి తెచ్చిందని అధికారులు తెలిపారు. ఆధార్ ఈకేవైసీ పూర్తయిన అభ్యర్థులు సారథి పోర్టల్ ద్వారా ఈ పరీక్షకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. అక్రమాలకు తావులేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ సహాయంతో అత్యంత పారదర్శకంగా ఈ ఆన్లైన్ పరీక్ష విధానాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.