కరెంట్ కోతలపై గద్వాలలో రైతుల రాస్తారోకో, బైఠాయించి ఆందోళన
రిపోర్టర్: మహేష్
స్థలం: జోగులాంబ గద్వాల
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో రైతులు విద్యుత్ సరఫరా తీరుపై భగ్గుమన్నారు. అప్రకటిత కరెంట్ కోతలు, లో-వోల్టేజీతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐజ-గద్వాల ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామన్న మాటలు నీటిమూటలయ్యాయని, మోటార్లు కాలిపోయి తీవ్ర నష్టం జరుగుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన కారణంగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.