వైజాగ్ అభివృద్ధిని ఓర్చుకోలేకే అవాస్తవాల ప్రచారం: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ధ్వజం

రిపోర్టర్: వెంకట్ స్థలం: విశాఖపట్నం

భోగాపురం విమానాశ్రయ భూముల కాజేతకు వైకాపా అధినేత జగన్ కుట్రలు చేశారని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విశాఖలో గంజాయి మాఫియాను ప్రోత్సహించిన జగన్.. కూటమి ప్రభుత్వం తెచ్చిన గూగుల్ సంస్థపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రుషికొండపై విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించుకున్నారని, ఉత్తరాంధ్ర అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.