రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా సెనేట్ భారీ టారిఫ్ సవరణ
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమెరికా
రష్యా నుంచి ముడి చమురు, సహజ వాయువు కొనుగోలు చేసే అగ్రగామి దేశాలపై వంద శాతం వరకు టారిఫ్‌లు విధించేలా అమెరికా సెనేట్‌లో కొత్త సవరణ ప్రతిపాదించారు. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు అమెరికా ఈ చర్యలు చేపట్టింది. ఈ నిబంధన భారత్ వంటి దేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అంతర్జాతీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది.