విద్యారంగంలో నైతిక విలువలు ఎంతో కీలకమన్న మంత్రి నారా లోకేశ్

రిపోర్టర్: కృష్ణ స్థలం: కాకినాడ

విద్యా వ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండాలని, విద్యతోనే సమాజంలో మార్పు తీసుకురావొచ్చని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. కాకినాడ జిల్లా ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారతీయం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఓర్పు, సహనం, నైతిక విలువలు చాలా అవసరమని, విద్యార్థులు దేశం కోసం ఆలోచించాలని లోకేశ్ పిలుపునిచ్చారు.