పోలీసు సిబ్బంది ప్రతిభను గుర్తించి నగదు ప్రోత్సాహకాలు అందజేసిన రామగుండం సీపీ

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లాలో సీసీఆర్బీ, సీసీఎస్, టాస్క్ఫోర్స్, ఐటీ కోర్, సైబర్ క్రైమ్ విభాగాల్లో అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న అధికారులు మరియు సిబ్బందికి రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. నేర నియంత్రణ, దర్యాప్తు, సైబర్ నేరాల అరికట్టడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని ఆయన అభినందించారు. పోలీసు విభాగాల సమన్వయంతో నేర నియంత్రణ మరింత సమర్థవంతంగా సాధ్యమవుతుందని సీపీ ఈ సందర్భంగా తెలిపారు.