యువ న్యాయవాదులకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చిన మధుకర్

రిపోర్టర్: శివ స్థలం: Vijayawada

విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో న్యాయవాదుల విభాగం ఆధ్వర్యంలో యువ న్యాయవాదుల శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయ రంగంలో నైపుణ్యంతో పాటు దేశం పట్ల నిబద్ధత, రాజ్యాంగ విలువల ప్రాముఖ్యతను ఆయన యువ న్యాయవాదులకు వివరించారు.