దివంగత నేత హనుమాన్ రెడ్డి సేవలను ఘనంగా స్మరించుకున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

రిపోర్టర్: T. SRAVAN స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా గోలివాడలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పెండ్రు హనుమాన్ రెడ్డి సంస్మరణ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. నాలుగు దశాబ్దాలుగా పార్టీ బలోపేతానికి హనుమాన్ రెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.