గుడివాడ అమర్నాథ్పై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తీవ్ర విమర్శలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అనకాపల్లి
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గాజువాకలో చెల్లని రూపాయి చోడవరంలో చెల్లుతుందా అని ఆయన ఎద్దేవా చేశారు. సొంత పార్టీలోనే ప్రాధాన్యం తగ్గడంతో చోడవరం రాజకీయాలపై అమర్నాథ్ దృష్టి పెట్టారని మండిపడ్డారు. ప్రజాదరణ లేని నాయకులు ఎక్కడ పోటీ చేసినా ప్రజలు ఆదరించరని స్పష్టం చేస్తూ, ఆయన చేసే మైండ్ గేమ్‌లు, రాజకీయ ప్రచారాల పట్ల చోడవరం ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం రమేష్ పిలుపునిచ్చారు.