విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్న విశ్వభారతి స్కూల్ యాజమాన్యంపై చర్యలు
రిపోర్టర్: Venkey ...Nlr
స్థలం: నెల్లూరు అర్బన్
నెల్లూరు సిటీ వెంకటేశ్వరపురంలోని విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం పదో తరగతి విద్యార్థులను ఇబ్బంది పెడుతోందని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాలలో అద్దం పగిలిందంటూ ఒక్కో విద్యార్థి నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేయాలని చూస్తున్నారని, ప్రశ్నించిన తల్లిదండ్రుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. సంబంధిత విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.