నిజామాబాద్ జిల్లాలో భారీగా మద్యం అమ్మకాలు: మూడు రోజుల్లో ఇరవై ఐదు కోట్లు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Nizamabad
నిజామాబాద్ జిల్లాలో దసరా పండుగ సందర్భంగా మద్యం అమ్మకాలు భారీగా జరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. అక్టోబర్ పదహారు, పదిహేడు, పద్దెనిమిది తేదీల్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏకంగా ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైన విక్రయాలు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. మూడు రోజుల్లో పదహారు వేల కేసుల మద్యం, యాభై వేల కేసుల బీర్లు అమ్ముడుపోయాయని పేర్కొన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి అమ్మకాలు గణనీయంగా పెరిగాయని ఎక్సైజ్ వర్గాలు స్పష్టం చేశాయి.