రాజస్థాన్ లో రైలు మార్గం దగ్గర పేలుడు: ఉలిక్కిపడ్డ స్థానికులు
రిపోర్టర్: నరేష్
స్థలం: శ్రీగంగానగర్
రాజస్థాన్ లోని అనుప్‌గఢ్-సూరత్‌గఢ్ రైల్వే మార్గంలో చోటుచేసుకున్న అనుమానాస్పద పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపిందని శ్రీగంగానగర్ ఎస్పీ హరిశంకర్ వెల్లడించారు. 50 జీబీ గ్రామం సమీపంలో రైలు మార్గానికి ఆధారంగా ఉన్న రెండు సిమెంట్ స్తంభాలు ధ్వంసమయ్యాయని, రైల్వే మార్గాన్ని దెబ్బతీసే ఉద్దేశంతోనే ఈ దుశ్చర్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నాయని, అన్ని కోణాల్ లో దర్యాప్తు కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు.