బురదమయంగా మారిన బొబ్బిలిపేట జగనన్న కాలనీ రహదారి: నడవలేక అవస్థలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఎచ్చెర్ల
ఆమదాలవలస మండలంలోని బొబ్బిలిపేట గ్రామంలోని జగనన్న కాలనీ రహదారి బురదమయంగా మారింది. చిన్నపాటి వర్షానికే రోడ్డుపై నీరు నిలిచి బురద గుంతలుగా తయారైందని ఆదివారం కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి, రహదారి మరమ్మతులు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.