ఉక్రెయిన్ ఆయుధాల కుంభకోణం: ఎస్టోనియా రక్షణ మంత్రి రాజీనామా

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: World

ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాలో జరిగిన రూ. 770 కోట్ల కుంభకోణంపై ఎస్టోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కర్ రాజీనామా చేశారు. భారతీయ సంస్థకు చెందిన డేటాసెల్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం వివాదాస్పదమైంది. నాణ్యత లేని ఆయుధాలు సరఫరా చేయడం, డెలివరీలో జాప్యం జరగడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. వ్యక్తిగత బాధ్యత లేకపోయినా, రాజకీయ బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.