విశాఖ ఆర్‌కే బీచ్‌లో మురీ మిక్చర్ రుచి చూసిన సీఎం చంద్రబాబు
రిపోర్టర్: రాజేష్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం ఆర్‌కే బీచ్‌లో శనివారం సాయంత్రం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా బీచ్‌లో మురీమిక్చర్ విక్రయించే అట్టాడ నాగమణితో మాట్లాడి మిక్చర్‌ను రుచి చూశారు బాగుందని కితాబిచ్చారు. అనంతరం జీవీఎంసీ పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి సముద్ర తీరంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు.