అవయవదానానికి ముందుకు వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఢిల్లీ
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా త్యాగరాజ్ స్టేడియంలో స్వయంగా రక్తదానం చేశారు. సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆమె తన శరీరంలోని 14 అవయవాలను దానం చేసేందుకు ప్రతిజ్ఞ చేయడంతో పాటు, ఎస్‌వోటీటీవో, నాటో ప్రత్యేక అవయవదాన పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు హర్ష్ మల్హోత్రా, మంత్రులు పాల్గొన్నారు.