అమెరికా భవిష్యత్తుపై నెతన్యాహు హెచ్చరిక: భారత్ తో వ్యూహాత్మక కూటములు అనివార్యం

రిపోర్టర్: కృష్ణ స్థలం: Tel Aviv

భవిష్యత్తులో అమెరికా అధ్యక్ష పదవికి ఇజ్రాయెల్ వ్యతిరేకి రావచ్చునని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రయోజనాల పరిరక్షణ కోసం భారత్ తో పాటు ఇతర దేశాలతో సరికొత్త వ్యూహాత్మక కూటములను ఏర్పాటు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తన భద్రతా విధివిధానాలను వెల్లడించారు. అమెరికా రాజకీయ భవిష్యత్తు అనిశ్చితంగా ఉన్న నేపథ్యంలో భారత్ వంటి బలమైన మిత్రదేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని నెతన్యాహు తేల్చిచెప్పారు.