కేసీఆర్ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తులపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్‌కు 1,000 ఎకరాల ఫామ్‌హౌస్ ఉందంటూ ప్రభుత్వం విషప్రచారం చేస్తోందని, ఆయన పేరు మీద ఉన్నది కేవలం 67 ఎకరాలు మాత్రమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆస్తులపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణకు తాము సిద్ధమని, రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన కుటుంబ ఆస్తులపై విచారణకు రావాలని సవాల్ విసిరారు.