ప్రధాని మోదీ ప్రజాసేవకు 25 ఏళ్లు: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు

రిపోర్టర్: రాము స్థలం: Andhra Pradesh

గుజరాత్ ముఖ్యమంత్రిగా రెండు వేల ఒకటో సంవత్సరంలో అక్టోబర్ ఏడవ తేదీన బాధ్యతలు స్వీకరించిన శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాసేవలో ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా దేశ సేవకు అంకితమైన ఆయన సుదీర్ఘ ప్రస్థానాన్ని స్మరించుకుంటూ రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని బీజేపీ ఆంధ్రప్రదేశ్ వెల్లడించింది. ఈ వేడుకల ద్వారా ఆయన పాలనాదక్షతను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు.