బెంగళూరులో భారీ వర్షం కారణంగా నీటమునిగిన ప్రధాన రహదారులు

రిపోర్టర్: హరి స్థలం: బెంగళూరు

బెంగళూరు నగరంలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం వేళ వీచిన ఈదురుగాలులతో కూడిన వానకు పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది. పీణ్యా ఫ్లైఓవర్, హెబ్బాల్ రింగ్ రోడ్, యలహంక అండర్ పాస్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.