పండుగ ముగియగానే ఈకామర్స్ దుస్తుల భారీ రిటర్న్స్: సోషల్ మీడియాలో వైరల్ వీడియో

రిపోర్టర్: నరేష్ స్థలం: Hyderabad

పండుగ వేడుకల కోసం కొత్త దుస్తులు ఆన్లైన్లో కొనుగోలు చేసి, ఆ తర్వాత వాటిని రిటర్న్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. నవరాత్రులు, డాండియా వేడుకలు ముగిసిన వెంటనే వేలాదిగా పార్శిళ్లు తిరిగి వస్తున్నట్లు నిశాంత్ చంత్ అనే ఎక్స్ యూజర్ షేర్ చేసిన క్లిప్ వైరల్గా మారింది. ఈ అనైతిక ధోరణి వల్ల ఈకామర్స్ సంస్థలతో పాటు అసలైన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు.