పోలవరం బ్యాక్ వాటర్ ముంపు ముప్పుపై కేంద్రానికి తెలంగాణ లేఖ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: భద్రాచలం
పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ వల్ల తెలంగాణకు తీవ్ర ముంపు ముప్పు పొంచి ఉందని రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్ కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాశారు. భద్రాచలం ప్రాంతం నీటమునిగే ప్రమాదం ఉందని, తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. సరిహద్దు ప్రాంతాల ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని బ్యాక్ వాటర్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.