బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రానున్న నరవది ఎనిమిది గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈదురుగాలుల సమయంలో చెట్లు లేదా విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని అధికారులు హెచ్చరించారు.