బీహార్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్: పరీక్ష ఫలితాలు విడుదల చేసిన బీపీఎస్సీ

రిపోర్టర్: శివ స్థలం: పాట్నా

బీహార్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ లో వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్ష ఫలితాలను బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 29, 30 తేదీల్ లో జరిగిన ఈ పరీక్షలకు 304 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాత పరీక్ష, విద్యార్హతలు, క్రీడా విజయాల ఆధారంగా 75 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూలకు షార్ట్ లిస్ట్ చేసినట్లు కమిషన్ వెల్లడించింది.